WhatsApp 2 step verification update
in , ,

Whatsapp లో 2 step verification enable ఎలా చేయాలి?

స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కీలకమైన వస్తువుగా మారిన ఈ కాలంలో,  whatsapp అనే సోషల్ మీడియా అప్లికేషన్ లేకుండా మన స్మార్ట్ ఫోన్ ని ఊహించలేము.

ఓ పక్క మన దేశంలో రూపుదిద్దుకున్న టెలిగ్రామ్ ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ తో అందుబాటులో వున్నప్పటికీ, వాట్సాప్ వాడకానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గతంలేదంటే, ఎప్పటకప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగణంగా తన ఫీచర్స్ ని update చేసుకుంటూ తన స్థానాన్ని మార్కెట్ లో నిలబెట్టుకుంటూ దూసుకుపోతుంది. వినియోగదారుల వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఈ మధ్య కాలంలో వాట్సప్ ఒక అద్భుతమైన feature ని తీసుకువచ్చింది.

WhatsApp-2-step-verification

మరి ఆ కొత్త feature గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మనం ఓక్కోసారి మన వాట్సాప్ అకౌంట్ ను వేరే ఫొన్ లో గాని, లేదంటే వేరే సిస్టమ్ లో గానీ లాగిన్ అవ్వాల్సి వచ్చినపుడు, మన పని అయిపోయాక లాగౌట్ అవటం మర్చిపోతే, వేరే వారు మన అకౌంట్ ను మన ప్రమేయం లేకుండా ఓపెన్ చేయటానికి అవకాశం వుంటుంది. అదే మనం ఈ కొత్తగా వచ్చిన 2 స్టెప్ వెరిఫికేషన్ ని enable చేసుకొంటే, మనం వేరే డివైజ్ లో లాగౌట్ చేయకపోయినా కానీ, వేరే వ్యక్తులు లాగిన్ అవటానికి ప్రయత్నిస్తే మన నంబర్ కి ఒక OTP వస్తుంది, ఆ OTP ని మనం వారికి ఇస్తే తప్ప వారు మన అకౌంట్ కి లాగిన్ అవ్వలేరు, మరి ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా enable చేయాలో తెలుసుకుందామా?

Proces of enabling :

1. మొదట మీ ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ ని ఓపెన్ చెయాలి.

2. తరువాత రైట్ సైడ్ టాప్ లో 3 డాట్స్ ని క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ ను ఎంచుకోవాలి.

4. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ని క్లిక్ చేస్తే ఎనబల్ ఆప్షన్ వస్తుంది.

5. ఇప్పుడు ఎనబెల్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కొరకు 6 డిజిట్ నంబర్ ( మనకు నచ్చిన 6 డిజిట్) ను ఎంటర్ చేయమని అడుగుతుంది.

6. ఎంటర్ చేశాక కన్ఫర్మేషన్ కొరకు సేమ్ 6 డిజిట్ ని మరో సారి ఎంటర్ చేయాలి.

7. అలా 6 డిజిట్ ని రీ ఎంటర్ చేశాక సమాచార భద్రత కొరకు e mail ని ఎంటర్ చేయమని అడుగుతుంది.

8. mail id ని ఎంటర్ చేసి ఒకే చేశాక, మళ్లీ mail id ని కన్ఫర్మేషన్ కొరకు రీ ఎంటర్ చేసి enable పై క్లిక్ చేయాలి.

అంతే 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనబులే అవుతుంది.

  • ఒకవేళ దీన్ని disablae చేయాలనుకుంటే మీరు disable కూడా చేసుకోవచ్చు.
WhatsApp 2 step verification

Process of disabling :

 1.యదావిధిగా వాట్సప్ అప్లికేషన్  ఓపెన్ చేసి  రైట్ సైడ్ పైన వున్న 3 డాట్స్ ని క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి.

 2. తర్వాత అకౌంట్స్ ని క్లిక్ చేయాలి.

 3. ఇక్కడ మనం 2 స్టెప్ వెరిఫికేషన్ ని క్లిక్ చేస్తే disable ఆప్షన్ వస్తుంది.

4. ఇప్పుడు disable ఆప్షన్ పై క్లిక్ చేస్తే disable అవుతుంది. ఈ విధంగా మీరు whatsapp 2 step verification ని enable లేదా disable చేసుకోవచ్చు.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Venkat Kanithi

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Whatsapp modified app in telugu

Whatsapp మాడిఫైడ్ వర్షన్ వాడుతున్నారా ….??? ఐతే ఈ విషయం తెలుసుకోండి

Mi 10000 mah Wirless Power Bank in telugu

Mi Wirless Power Bank 10000 mah గురించి తెలుసుకుందాం