Samsung galaxy s6 tab
in , , ,

Samsung galaxy tab s6 lite మార్కెట్ లోకి వచ్చేసింది…!!

మన దేశంలో ఇప్పుడు ఉన్న కరోన కారణంగా స్కూల్స్ ,  కాలేజీ వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ ఏ జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని samsung సంస్థ ఒక కొత్త టాబ్ ని మనకు పరిచయం చేస్తుంది. ఈ ఆన్లైన్ class కోసం పేరెంట్స్ అప్పు చేసి మరీ  టాబ్ లు కొంటున్నారు. నిన్న మొన్నటి దాకా మొబైల్స్ లో ఆన్లైన్ క్లాస్ విన్న అందరూ ఇప్పుడు మినీ టాబ్ లు మరియు టాబ్స్ పై మొగ్గుచూపుతున్నారు. టాబ్ లో ఐతే మొబైల్ కంటే స్క్రీన్ పరిమాణం పెద్దగా ఉంటది ఈజీగా పిల్లలకు అర్ధం అవుతుంది అని బావిస్తున్నారు.

Samsung galaxy s6 tab

ఇదే టైం లో మన samsung సంస్థ మన కోసం ఒక కొత్త టాబ్ నైతే పరిచయం చేయబోతోంది. దాని గురించి తెలుసుకుందాం. ఈ సంస్థ ఐతే టాబ్ ని samsung గాలక్సీ టాబ్ S6 లైట్ గా మనకు పరిచయం చేసింది. ఈ samsung గాలక్సీ టాబ్ s6 లైట్ మోడల్ ని భారతదేశం లో విడుదల చేసింది.

ఈ samsung గాలక్సీ టాబ్ డిస్ప్లే పరిమాణం వచ్చేసి 10.4 అంగుళాలు ఉంటుంది. ఇందులో పిల్లలకు చాలా క్లియర్ గా ఆన్లైన్ క్లాస్ వినగలుగుతారు. ఈ టాబ్ 2000×1200 పిక్సెల్  రిజల్యూషన్ కలిగి ఉంటుంది. IPS LCD తో చాలా పలుచని అంచులతో అన్ని వైపులా అలానే ఉంటుంది స్క్రీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ samsung galaxy టాబ్ చాలా స్లిమ్ గా ఉంటుందని samsung సంస్థ చెప్తున్నారు.

Features గురించి తెలుసుకుందాం.

ఈ samsung galaxy టాబ్ S6 లైట్ వచ్చేసి రెండు వేరియంట్స్ తో వస్తుంది.  ఇందులో 4gb ram 64gb storage ని కలిగి ఉంటాయి. ఎక్సపాండ్ 1TB వరకు స్టోరేజ్ ని పెంచుకోవచ్చు అలానే ఈ టాబ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 మీద రన్ చేస్తున్నారు. బ్యాటరీ 7040 mah తో దీనిని తీసుకొచ్చారు.

Samsung galaxy s6 tab

ఈ samsung గాలక్సీ టాబ్ S6 లైట్ లో ముందు భాగంలో 5 magapixle కెమెరా సెటప్ చేశారు అలానే వెనుక భాగంలో 8 magapixle ని అమర్చారు. ఇందులో శంసింగ్ సంస్థ సొంతంగా తయారు చేసిన  EXYNOS  9611 processer తో ఇది పనిచేస్తుంది. ఈ టాబ్ లో మనకి  టాబ్ తో పాటు S-pen ని ఇస్తున్నారు  ఈ s పెన్ కి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు టాబ్ తో ఇది పనిచేస్తుంది. ఈ టాబ్ వచ్చేసి టైప్ C cable తో వస్తుంది 15w ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

ఈ samsung గాలక్సీ టాబ్ S6 లైట్ వచ్చేసి అమెజాన్ లో మనము కొనుగోలు చేసుకోవచ్చు. అదే విధంగా  ఇప్పుడు అమెజాన్ లో pre order  sale ఐతే నడుస్తుంది. ఇందులో మనకి మూడు colours ఐతే ఇచ్చారు grey , blue , pink.

Samsung galaxy tab  S6 lite  4g  సదుపాయం కలిగిన tab  ధర వచ్చేసి 31,999 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు. అలానే  wifi మాత్రమే కలిగిన మోడల్ ని 27,999 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు  జూన్ 17 నుండి అన్ని ప్రదేశాలలో అమ్మకాలు జరుగుతాయి

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Pranay

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
MITRON APP సోషల్ మీడియాలో హల్చల్...!!

MITRON APP సోషల్ మీడియాలో హల్చల్…!!

Why people like iPhone best features

Apple మొబైల్ అంటే మనకు ఎందుకు అంత ఇష్టం….??