in , ,

ట్విట్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా వాడాలి? ఉపయోగాలేమిటి?

ట్విట్టర్ అకౌంట్ గురించి:

ట్విట్టర్ అనేది 140 వరకూ అక్షరాలు కలిగిన చిన్న చిన్న సందేశాలను ఇతరులతో పంచుకొనుటకు, అలానే ఇతరుల నుండి పొందుటకు ఉపయోగపడే వేదిక.

ట్విట్టర్ యొక్క ఉపయోగాలు:

మనం ఏదైనా ఒక టాపిక్ గురించి తెలియజేయాలని అనుకున్నపుడు, మొత్తం సమాచరాన్ని రాయకుండా, ఉదాహరణకు భారతదేశం  వ్యవసాయ పరంగా మంచి వనరులున్న దేశం అని వివరించాలి అనుకుంటే, దానికీ సంబంధించిన నదులు, భూములు గురించి మొత్తం సమాచారం రాయకుండా, ఇండియా ఈస్ ఏ గ్రేట్ ప్లేస్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్ అని ట్వీట్ టైప్ చేసి దానికి సంబంధించిన నదులు, ప్రాజెక్టులు, అనువైన భూములు మొదలగు వాటి లింక్స్ అనేటివి జత చేయవచ్చు. అలానే ధోనీ సిక్స్ కొట్టాడు అని ట్వీట్ టైప్ చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ ని జత చేయవచ్చు.

చేస్తున్న ఫీల్డ్ కి అప్ డేటెడ్ గా మన అభిరుచికి తగ్గట్టుగా, లేదా మన ఫీల్డ్ కి రిలేటెడ్ గా వున్నవారిని  మనం ఫాలో అవ్వొచ్చు, ఉదాహరణకు మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడర్ అయితే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాల్సి ఉంటుంది, దీని కొరకు మీరు మన ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ తో పాటు వరల్డ్ లో మార్కెట్స్ గురించి కామెంట్ చేసే వారి ట్విట్టర్ అకౌంట్స్ ను ఫాలో అయితే వీలైనంత త్వరగా మార్కెట్లకు సంబంధించిన న్యూస్ తెలుసుకొనే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందామా.

How to create twitter account?

1. మొదట మీ స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ కి వెళ్లి ట్విట్టర్ యాప్ ని ఇన్స్టాల్ చేయాలి.

2. ఇప్పుడు యాప్ ను ఒపెన్ చేయాలి

3. ఇక్కడ సైన్ అప్ మరియు లాగ్ ఇన్ అనే ఆప్షన్స్ కన్పిస్తాయి, ఇప్పుడు సైన్ అప్ బటన్ ను క్లిక్ చేయండి.

4. ఇక్కడ మీ వివరాలు (  పేరు, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేది) ఇవ్వాలి. అవసరం అనుకుంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వొచ్చు, ఇది ఆప్షనల్ గా అడుగుతుంది.

5. ఇక్కడ సైన్ అప్ బటన్ పై క్లిక్ చేయాలి.

6. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ కు ఒక టెక్స్ట్ మేసేజ్ ద్వారా వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.

7. ఇప్పుడు మీ నంబర్ కు వచ్చిన కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

8. ఇప్పుడు మీ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది.

ఇప్పుడు మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు ఎవరినైనా ఫాలో అవ్వొచ్చు

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Venkat Kanithi

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0

కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకుందాం

About Real me TV features in telugu

Real me smart tv మన బడ్జెక్ లో…!!