What is trading in telugu
in , ,

ట్రేడింగ్ యాప్ అంటే ఏమిటి? ది బెస్ట్ యాప్ ఎలా ఎంచుకోవాలి?

మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అంటే భయం, నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది, కొంతమంది అయితే దీన్ని ఒక జూదంలా చూస్తారు.

సరే ఇప్పుడు ఈ నెగెటివ్ థింగ్స్ అన్నీ పక్కనబెడతే, అసలు ట్రేడింగ్ యాప్ అంటే ఏమిటి, అందులో మంచి యాప్ ను  ఎంచుకోవడం ఎలా? అనే విషయాన్ని తెలుసుకుందాం.

ట్రేడింగ్ యాప్ అంటే ఏమిటి?

సింపుల్ గా చెప్పాలంటే ట్రేడింగ్ యాప్ అనేది మనం షేర్లు కొనటానికి మరియు అమ్మటానికి అవసరమైన ఒక వేదిక. మరి ఇందులో బెస్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అది మనకున్న రిక్వైర్మెంట్ పై ఆధారపడి వుంటుంది, మరి మనం బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన రిక్వైర్మెంట్ ఏమిటో మనకు ఖశ్చితంగా తెలిసి ఉండాలి.

What is trading in telugu

కొంతమంది చాలా తక్కువ అమౌంట్ తో ట్రేడింగ్ చేస్తుంటారు, అంటే వేయిరుపాయలు లేదా రెండువేల రూపాయల తో అన్నమాట, కొంతమంది ఇంతకన్నా తక్కువ అమౌంట్ తో కూడా ట్రేడింగ్ చేస్తారు, ఇటువంటి వారికి చాలా పెద్దమొత్తంలో లిమిట్ అవసరం ఉంటుంది, లిమిట్ అంటే ఉదాహరణకు మన ట్రేడింగ్ అకౌంట్ లో 1000 రూపాయలు వుంటే, ఆ రోజు ట్రేడ్ చేయటానికి ట్రేడింగ్ కంపెనీలు  మన ట్రేడింగ్ అకౌంట్లో వున్న బ్యాలన్స్ అమౌంట్ కి కొన్ని కంపెనీలు 5 టైమ్స్, కొన్ని 10 టైమ్స్,  అలానే కొన్ని కంపనీలైతే ఏకంగా 38 టైమ్స్ వరకూ కూడా లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 38 టైమ్స్ లిమిట్ అంటే మన ట్రేడింగ్ అకౌంట్ లో 1000 రూపాయలు ఉంటే, ఆ రోజు వరకు ట్రేడ్ చేసుకొనుటకు 38000 రూపాయలు అప్పుగా ఇస్తారు, ఈ అమౌంట్ అనేది మనకు విత్ డ్రా చేసుకోవటానికి ఉండదు, ఓన్లీ మార్కెట్ లో ట్రేడ్ చేయటానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఎక్కువ అమౌంట్ లేనివారు, ఇలా అధికంగా లిమిట్ ప్రొవైడ్ చేసే కంపెనీలను అప్రోచ్ అవుతారు.

అయితే ఈ లిమిట్ ప్రొవైడ్ చేసినందుకు కంపెనీలు మన దగ్గర ఇంట్రెస్ట్ ఏమీ ఛార్జ్ చెయ్యవు కానీ, మనం చేస్తున్న ట్రేడింగ్ టర్నోవర్ పైన (100 రూపాయల కి) 0.01 పైసా, 0.02 పైసా, కొన్ని కంపెనీలు 0.03, 0.04, కొన్ని 0.05 పైసా చొప్పున బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తాయి, ఈ బ్రోకరేజ్ తో పాటుగా గవర్నమెట్ కి సంబంధిన కోన్ని టాక్స్ లు కూడా యాడ్ అవుతాయి.  వీటితో పాటు ఆన్యువల్ మేయింటేన్స్ చార్జెస్ కూడా ఉంటాయి. (ఈ చార్జెస్ అన్ని కూడా జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే, మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే సంబంధిత బ్రోకర్ దగ్గర అన్ని చార్జెస్ కి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకోండి).

What is trading in telugu

మరికొంతమంది ట్రేడింగ్ కోసం చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ పెడతారు, వీరికి ట్రేడింగ్ కంపెనీలు ఇచ్చే లిమిట్ అమౌంట్ తో పెద్దగా అవసరం వుండదు, వీరు వీలైనంత తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేసేటటువంటి కంపెనీలను అప్రోచ్ అవుతుంటారు.

ఈ బ్రోకరేజ్ మరియు లిమిట్ విషయం పక్కనబెడితే, మనం తెలుసుకోవాల్సిన మరో విషమేమంటే, ట్రేడింగ్ లో వితిన్ సెకండ్స్ లో ప్రైసెస్ మారిపోతుంటాయి, అందువల్ల దానికి అనుగుణంగా వీలైనంత తక్కువ వ్యవధిలో buy/sell  ఆర్డర్ ప్లేస్ చేయటానికి అనువుగా వుండే యాప్ ని ఎంపిక చేసుకోవాలి. ఇందులో ఒక్క ఇంట్రా డే ట్రేడింగ్ మాత్రమే కాకుండా, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు.

ఈ ఆర్టికల్ లో పొందుపరచిన సమాచారం మొత్తం ఒక అవగాహన కొరకు మాత్రమే, మీరు ఏదైనా డీ మ్యాట్ అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే సంబంధిత కార్యాలయాలను సంప్రదించి బ్రోకరేజ్ చార్జెస్, అన్యువల్ చార్జెస్ మరియు ట్రేడింగ్ ప్లాట్ఫాం గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Venkat Kanithi

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
షియోమి నుండి redmi note 9 mobile బడ్జెక్టు ధరలో వచ్చేస్తుంది..!!

షియోమి నుండి redmi note 9 mobile బడ్జెక్టు ధరలో వచ్చేస్తుంది..!!

మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా...?

మీరు వాయిస్ తో తెలుగు లో టైప్ చేయాలనుకుంటున్నారా…?