in , ,

గూగుల్ 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎలా ఎనేబుల్ చేయాలి?

ఒకప్పుడు మనం మన వ్యక్తిగత విషయాలను, రోజువారీ కార్య్రమాల్ని, బ్యాంక్ అకౌంట్ నంబర్లను, ముఖ్యమైన ఫోన్ నంబర్లను డైరీ లో రాసుకొనేవాళ్ళం. రోజురోజుకీ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో మన ఫోన్లే డైరీలు గాను, వాలెట్లు గాను, ఫొన్ బుక్ లు గాను, చెల్లింపు బ్యాంక్ లు గాను మారిపోయాయి.

మన ఫోన్లో వాడుతున్న ప్రతిఒక్క అప్లికేషన్ (aap) మన ఈ మెయిల్ ఐడీ తో అనుసంధానం కలిగి వుంటుంది, మనం ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా, మెయిల్ ఐడి ని ఉపయోగించి పాస్వర్డ్ ను తిరిగి పొందవచ్చు, అంతే కాకుండా ఏదైనా సోషల్ మీడియా యాప్ ని అన్ ఇన్స్టాల్ చేసి తిరిగి మరలా ఇన్స్టాల్ చేసుకుంటే అందులో వున్నటువంటి డేటా ని రికవర్ చేయటానికి కూడా మెయిల్ ఐడి ని జత చేయాల్సి వుంటుంది. మరి మన ఫోన్లో వాడుతున్న ప్రతి అప్లికేషన్ కి సంబంధించిన డేటా సేఫ్ గా ఉండాలన్నా, అలానే మనకి కావలసినపుడు డేటా రికవరీ చేసుకోవాలని అనుకున్నా మన మెయిల్ ఐడి ని ఎవ్వరూ మిస్ యూజ్ చేయకుండా, హ్యాక్ చేయకుండా మెయిల్ ని సేఫ్ గా ఉంచటానికి భద్రత అనేది చాలా అవసరం. మరి దీనికి సంబదించి గూగుల్ కంపెనీ వారు 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఒక కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి ఈ ఫీచర్ ని ఉపయోగించి మన మెయిల్ ఐడీ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చో, దానికి సంబంధించి తీసుకోవలసిన  స్టెప్స్ గురించి ఈ రోజు తెలుసుకుందామా!

Process of enabling 2 step verification for mail id.

1. మొదట బ్రౌజర్ ఓపెన్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ అని టైప్ చేయండి.

2. టైప్ చేశాక, 2 స్టెప్ వెరిఫికేషన్ సైట్ లోకి వెళ్ళి క్రింద వున్న గేట్ స్టార్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

3.  ఇప్పుడు క్రిందకు వెళ్లి మరలా గెట్ స్టార్టెడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు మీ జీ మెయిల్ ఐడీ ని పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

5. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ను టర్న్ ఆన్ చేసి, మీ చేతిలో ఎప్పుడూ అందుబాటులో వుండే ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయండి.

6. ఇప్పుడు గూగుల్ నుండి మీ మొబైల్ కి వచ్చిన కోడ్ ని ఎంటర్ చేయండి.

అంతే ఇప్పుడు మీ మెయిల్ ఐడీ కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ అయింది. ఈ ప్రాసెస్ ఎనబుల్ చేయటం వలన మీ మెయిల్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినప్పటికీ, లాగిన్ అయ్యే ముందు మీ నంబర్ కు వచ్చే OTP ని మీరు చెబితేనే వారు మీ అకౌంట్ కి లాగిన్ అవ్వగలరు. కేవలం మెయిల్ ఐడి పాస్వర్డ్ వున్నంత మాత్రాన వారు లాగిన్ కాలేరు

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Venkat Kanithi

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0
Realme C11 mobile in telugu

Realme C11 mobile కేవలం 7,499 రూపాయలకే …!!

కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకుందాం