in ,

కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకుందాం

మానవ జీవితంలో ఇంతవరకు ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే నడిచి వెల్లేవారిమి, ఆ తర్వాత గుఱ్ఱం, ఏనుగు, ఒంటే లాంటి జంతువులను ఉయోగించి ప్రయనించాము. తర్వాత సైకిల్, ఆ తర్వాత  సైకిల్ కి మోటార్ అమర్చి, మోటార్ బైక్ లను, తర్వాత రెండు చక్రాలు కలిగిన మోటార్ సైకిల్ స్థానంలో మూడు చక్రాల ఆటో, నాలుగు చక్రాల కారు, వ్యాను, బహు చక్రాలు కలిగిన బస్సు, రైలు వంటి వాహనాలను తయారుచేసుకుని ప్రయాణం చేస్తున్నాం. ఒక్క ప్రయాణం చేసే విషయంలోనే కాకుండా, మనం ప్రతిరోజూ చేసే పనులన్నీ సులభతరం చేసుకొనుటకు అనేక రకాల ఆవిష్కరణలు రూపొందించటం జరిగింది. అయితే మనం రూపొందించిన ఈ సాంకేతిక మొత్తం కూడా మనం చేసే ఆపరేటింగ్ కి అనుగుణంగా మాత్రమే పనిచేస్తుంది తప్ప, తనకు తానుగా ఆలోచించి ఎటువంటి నిర్ణయం తీసుకోజాలదు, కానీ ఈ కృత్రిమ మేధస్సు ని జోడించుకొని తయారవుతున్న ఆవిష్కరణలు మాత్రం తమంతట తాము ఆలోచించి స్వంత నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయి.

ఒక విధంగా చెప్పాలంటే, మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి సెటిల్ అయినపుడు, మనం ఉంటున్న ప్రదేశానికి, పని చేసే ప్రదేశానికి వెళ్లే దారి మనకు అలవాటు అయ్యే వరకూ కొత్తగా వుంటుంది, అప్పుడప్పుడు దారి మర్చిపోవడం కూడా జరుగుతుంది, కానీ ప్రతి రోజూ మనం ఆ దారి లో ప్రయాణం చేస్తున్నకొద్దీ, ఆ దారిలో ఎక్కడ ఏ షాప్ ఉంది, ఎక్కడ ఏ టెంపుల్ వుంది? ఇలా ఆ రూట్ కి సంబంధించిన సమాచారం అంతా కూడా మన మెదడలో నిక్షిప్తం అవుతుంది. అలా మనం రోజూ ప్రయాణిస్తున్న దారిలో ఉదయం 8 గంటల తర్వాత ట్రాఫిక్ పెరుగుతుంది అని గమనిస్తే, అప్పుడు మనం ఒక పావుగంట ముందుగా బయలుదేరటానికి ప్రయత్నిస్తాం, అంటే మనం మన చుటటుపక్కల ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది, అలానే ఈ కృత్రిమ మేధస్సు తో తయారయ్యే ఆవిష్కరణలు కూడా ఒక పనిని పదే  పదే చేయటం ద్వారా, తను చేస్తున్న పనిని ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో ఆలోచించి అమలు పరచగలుగుతాయి. ఉదాహణకు మనం ప్రయాణిస్తున్న కారు మనం ఏ దారిలో డ్రైవింగ్ చేస్తున్నామో, ఆ దారిలో ట్రాఫిక్ ఉన్నప్పటికీ అదే దారిలో నడుస్తుంది, అంతే కానీ పక్క రోడ్డు లో ట్రాఫిక్ తక్కువగా ఉంది కదా అని అది పక్కకు వెళ్ళదు, కనీసం అలాంటి సలహా  కూడా మనకు ఇవ్వదు. కానీ ఈ కృత్రిమ మేధస్సు తో తయారయ్యే కార్లు మాత్రం, తమలో నిక్షిప్తం చేయబడ్డ సమాచారాన్ని ఉపయోగించి ఏ రూట్లో ట్రాఫిక్ తక్కువగా ఉంది, ఏ రూట్లో వెళ్తే  ప్రయాణం సులభంగా, క్షేమంగా  సాగుతుందో అనే అంశాలను విశ్లేషించి, వాటంతట అవే రూట్ మ్యాప్ ను రూపొందించుకొని  మనల్ని గమ్య స్థానాలకు క్షేమంగా చేరుస్తాయి.

ఈ కృత్రిమ మేధస్సు కి సంబంధించి మనందరికీ తెలిసిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనం గూగుల్ సెర్చ్ బార్ లో కాని, వాట్సాప్ లో కాని  ఏదైనా టైప్ చేస్తుంటే, మనకి కావలసిన ఓర్డ్స్ అనేవి డిస్ప్లే కావటం అనేది ఈ కృత్రిమ మేధస్సు ద్వారానే జరుగుతుంది, అంటే  వాటిలో నిక్షిప్తమైన సమాచారాన్ని ఆధారంగా చేసకొని, మనం టైప్ చేయబోతున్న   పదాలు ఏమిటో ముందుగానే ఊహించి మనకు సజెస్ట్ చేస్తుంటాయి.

భవిష్యత్తులో ఈ కృత్రిమ మేధస్సు ద్వారా  ఒక గొప్ప సాంకేతిక విప్లవం రాబోతుంది. అయితే ఇది మనిషి కంట్రోల్ లో ఉన్నంతవకూ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ ప్రపంచాన్ని దాటి ఆలోచించే సామర్ధ్యం కలిగిన ఈ కృత్రిమ మేధస్సు మనిషి పైన ఆధిపత్యం చెయ్యటం మొదలు పెడితే మనిషి దీనితో పోటీ పడటం చాలా కష్టమవుతుంది.

This post was created with our nice and easy submission form. Create your post!

What do you think?

Written by Venkat Kanithi

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0

గూగుల్ 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎలా ఎనేబుల్ చేయాలి?

ట్విట్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా వాడాలి? ఉపయోగాలేమిటి?